వెంకీకి ‘ఎఫ్3’ టీమ్ స్పెషల్ విషెస్..వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం

'F3' team special wishes for Venky..video released film crew

0
122

ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పిలుచుకునే వెంకీమామ బర్త్​డే ఈరోజు. ఈ డిసెంబరు 13న వెంకటేశ్ 62వ వసంతంలోకి అడుగుపెట్టారు. 35 ఏళ్ల కెరీర్​లో 74 సినిమాలు చేశారు విక్టరీ వెంకటేశ్. తెలుగులో మీరు ఏ హీరోకైనా అభిమాని అయ్యిండొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ​ మెచ్చే ఏకైక హీరో విక్టరీ వెంకటేశ్. ఈ మాట చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తాజాగా విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం F3. వెంకీ బర్త్ డే సందర్బంగా ‘ఎఫ్3’ చిత్రబృందం విష్ చేస్తూ చిన్న వీడియోను విడుదల చేసింది. అందులో వెంకీ నవాబ్ గెటప్ లో కనిపించారు. చార్మినార్ ముందు నవాబ్ అవతారంలో కూర్చొని.. చేతిలో రెండు వేల రూపాయలు నోట్లు పట్టుకొని వెంకీ కనిపించారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://youtu.be/9ggnRtKZssI

ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దర్శకుడు అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్, అంజలి లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.