రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెడ్ సినిమా… అయితే ఇప్పుడు సినిమా స్టోరీల సెలక్షన్ పై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు హీరో రామ్… తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి పేరు వినిపిస్తోంది, అయితే ఇందులో చాలా సరికొత్తగా రామ్ కనిపిస్తారు అని తెలుస్తోంది.
అయితే తర్వాత మరో సినిమా కూడా రామ్ ఒ కే చేశారు అని టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో.. అయితే ఆ దర్శకుడు ఎవరు అంటే అనిల్ రావిపూడి అంటున్నారు.. అవును ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు ఈ సినిమా అయిన తర్వాత తదుపరి రామ్ తోనే అనిల్ సినిమా ఉంటుంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
అయితే గతంలో అనిల్ రావిపూడి రామ్ తో రాజా ది గ్రేట్ సినిమా చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో రవితేజతో తెరకెక్కించారు, అయితే ఈసారి ఎలాగైనా అనిల్ తో సినిమా చేయాలి అని రామ్ కూడా ఫిక్స్ అయ్యారట….అయితే ఎఫ్ 3 పూర్తి అయ్యాక పక్కాగా ఈ చిత్రం ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.