హీరోయిన్ నగ్మా గురించి మీకు ఈ విషయాలు తెలుసా

హీరోయిన్ నగ్మా గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
112

నగ్మా ఈ అందాల తార సినిమా వస్తోంది అంటే అభిమానులు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు టికెట్ల కోసం..నగ్మాకు అంత ఫాలోయింగ్ ఉంది టాలీవుడ్ లో ,అగ్రహీరోలు అందరితో ఆమె నటించారు.
1974 డిసెంబరు 25న ఆమె పుట్టారు.

ఆమె హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్పురి, పంజాబీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించింది.. నగ్మా కుటుంబం వ్యాపారవేత్తల కుటుంబం, అంతేకాదు
ఆమె ముంబయిలోని బాంద్రా వెస్ట్ లో నగ్మాస్ అనే పేరుతో దుస్తుల వ్యాపారాన్ని సెప్టెంబరు 2000 లో స్థాపించి అక్షయ్ కుమార్ తో ప్రారంభోత్సవం చేయించింది.

కాని కొంత కాలానికి ఈ వ్యాపారం మూసివేశారు అది విజయవంతం అయినా తండ్రి అనారోగ్యం కారణంగా ఆమె అక్కడ ఉండటంతో ఈ వ్యాపారం 2003 లో క్లోజ్ చేశారు..నగ్మా సినిమా ప్రస్థానాన్ని హిందీ సినిమా బాగీ ఎ రెబల్ ఆఫ్ లవ్ చిత్రంతో ప్రారంభించింది. ఆమె తల్లి సినిమాల్లోకి రావడానికి ఆమెని ప్రొత్సహించింది. ఇక రాజకీయంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

నగ్మా నటించిన తెలుగు సినిమాలు ఇవే

పెద్దింటల్లుడు
కిల్లర్
ఘరానా మొగుడు
అశ్వమేధం
అల్లరి అల్లుడు
మేజర్ చంద్రకాంత్
సూర్యపుత్రులు
మౌనం
అల్లరి రాముడు
కొండపల్లి రాజా
ముగ్గురు మొనగాళ్లు
ఆవేశం
బావొచ్చాడు
పిస్తా
భారతసింహం
ప్రేమికుడు
లవ్.బర్డ్స్
అరవింద్
శాస్త్రి
బాషా
అడవిదొర
రెండిళ్ల పూజారి
సరదా బుల్లోడు
సూపర్ పోలీస్
వారసుడు
గ్యాంగ్ మాస్టర్
రిక్షావోడు