మెగా సినిమాలో ఫహద్ ఫాజిల్ ?

Fahadh Faasil in megastar new movie?

0
108

ఫహద్ ఫాజిల్ సినిమా పరిశ్రమలో ఎంతో మంచి పేరు ఉంది. మలయాళంలో మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు ఉంది. అనేక భాషల నుంచి ఆయనకు అవకాశాలు వస్తున్నాయి.మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడైన ఫహద్ వ‌రుస చిత్రాల‌తో చాలా బిజీగా ఉన్నారు . ఇక ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ తెలుగులో సుకుమార్ బన్నీ సినిమా పుష్ప‌లో నటిస్తున్నారు ఇందులో ఫహద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

తమిళంలో కమలహాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమాలో కూడా విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా సౌత్ లో తనకంటూ ప్రత్యేక మార్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నారాయన.
తాజాగా మరో వార్త వినిపిస్తోంది. తెలుగులో మరో భారీ చిత్రంలో నటించే అవకాశం ఫహద్ కు వచ్చినట్టు టాలీవుడ్ టాక్ న‌డుస్తోంది.

రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఈ సినిమాలో ఆయనని విలన్ పాత్రకి పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.