కవలలకు జన్మనిచ్చిన ఫేమస్‌ సింగర్‌

0
117

చిన్మయి- రాహుల్ 2014 లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే చిన్మయి తాను గర్భవతి అనే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే..చిన్మయి శ్రీపాద గత రాత్రి కవలపిల్లలకు జన్మనివ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నిఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

దాంతో విషయం తెలిసిన నెటిజన్స్ చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏ మాయ చేసావే, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరివాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె మధురమైన గొంతుతో పాటలు పాడి ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది.