అభిమానులు చేతిలో దెబ్బలు తిన్న సిని సెలబ్రిటీ

అభిమానులు చేతిలో దెబ్బలు తిన్న సిని సెలబ్రిటీ

0
88

సెలబ్రెటీలు అంటే ప్రజల్లో ఓ క్రేజ్ ఉంటుంది. సెలబ్రెటీలు ఎక్కడైనా కనిపిస్తే వారితో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సహాం చూపుతుంటారు. అయితే కొంత మంది నటులు సహనంతో అభిమానుల కోర్కెలు తీరుస్తారు.. మరికొంత మంది నటులు బిజీ అంటూ తప్పించుకుంటారు. కానీ ఈ నటుడు మాత్రం తన పిచ్చి పనులతో అభిమానుల చేతిలో తన్నులు తిన్నాడు.

కన్నడలో నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు హుచ్చా వెంకట్. సినీ సెలబ్రెటీ అయినా వెంకట్ మాత్రం ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉంటూ వస్తున్నారు. కన్నడలో బిగ్బాస్-3లో పాల్గొన్న సమయంలోఅతనిపై ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి.

వెంకట్ తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఓ హోటల్ కు వెళ్ళాడు ఈ నటుడు. దీంతో అతడిని చూసేందుకు, అభిమానులు పెద్ద ఎత్తున అతని వద్దకు చేరుకున్నారు. కానీ ఆయన ప్రవర్తన మాత్రం అందరినీ ఆశ్చర్య పరిచింది. కేఎస్‌ఆర్టీసీ ఎదుట నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు ఎందుకలా చేసారని నిలదీశారు. అయినా అతను మాట వినపోవడంతో ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. విషయం తెలుసుకున్న స్థానిక మీడియా వర్గాలు అక్కడి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ గొడవకు సంబంధించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంకట్ ని అరెస్ట్ చేశారు.