బ్రేకింగ్: ‘RRR’ సినిమా చూస్తుండగా అభిమాని మృతి

0
95

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఏపీలోని అనంత‌ర‌పూరం జిల్లాలో ఓ థీయేట‌ర్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంది. సినిమా చూడాలని వచ్చిన అభిమాని టికెట్ తీసుకొని సినిమా చూస్తున్నాడు. అప్పటివరకు బాగానే ఉన్న ఆ వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీనితో అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.