ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు హీరో జూనియర్ ఎన్టీఆర్. స్వయంగా వీడియో కాల్ చేసి..ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ..జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బ తినడం వల్ల విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి తన చివరి కోరికగా..జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని వైద్యులకు చీటి రాసి చూపించాడు. ఆ విషయాన్ని వైద్యులు మురళీ బంధువులకు చెప్పారు. వెంటనే వారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి మురళీ చివరి కోరికను తెలియజేశారు.
తన అభిమాన సంఘం సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వెంటనే మురళీకి వీడియో కాల్ చేశారు. తనను ఎంతగానే ప్రేమిస్తున్న తన అభిమానికి ఇలా జరగడం తనను కలచివేసిందని చెప్పారు. మురళీ కోసం వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన జూనియర్ ఎన్టీఆర్‌కు.. ఆయన బంధువులు ధన్యవాదాలు తెలిపారు. యంగ్ టైగర్‌పై ప్రశంసలు కురిపించారు.