ఫాన్స్ కు పండగే..ఎఫ్‌-3 సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడట

0
98

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు.

ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనున్న క్రమంలో మేకర్స్ ప్ర‌మోష‌న్ల‌పై దృష్టి పెట్టి జోరుగా జ‌రుపుతుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి దిల్‌రాజు కొన్ని ఆసక్తికర విషయాలను విషయాలను చెప్పి ప్రేక్షకులను సస్పెన్సు లో ఉంచాడు. ఈ చిత్రంలో పెద్ద స‌ర్‌ప్రైజ్ ఉంటుందని.. తెర మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తాడ‌ని చెప్పి ఫ్యాన్స్ ను ఆనందానికి గురిచేశాడు. ఈ చిత్రం ఖ‌చ్చితంగా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్పుకురావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఎఫ్ 3 ఎలాంటి విజయాన్ని సాదించబోతుందో!