అదరగొడుతున్న ప్రేమికుల పాట

0
94

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి కలెక్షన్ల సునామి సృష్టించింది. రీసెంట్ గా 400కోట్ల క్లబ్ లోకి చేరింది ‘రాధేశ్యామ్’.

తాజాగా ఈ సినిమా నుండి ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రేమికుల పాట ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొసడుతుంది. కృష్ణ‌కాంత్ రాసిన ఈ పాట‌ను యువ‌న్ శంక‌ర్ రాజా, హ‌రిణి ఇవటూరి పాడగా.. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ కంపోజ్ చేశాడు.

ఎవ‌రో వీరెవ‌రో క‌లవ‌నీ ఇరు ప్రేమికులా..ఎవ‌రో వీరెవ‌రో విడిపోని యాత్రికులా అంటూ రొమాంటిక్ మెలోడీ సాంగ్ స్లో మోష‌న్ లో సాగుతూ ప్ర‌భాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా చేస్తోంది. ప్ర‌భాస్‌, పూజాహెగ్డే మ‌ధ్య వచ్చే రొమాంటిక్ స‌న్నివేశాల‌తో కూల్‌కూల్‌గా సాగుతున్న ఈ పాట‌ను మ్యూజిక్ ల‌వ‌ర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వీడియో సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/b1_5YO11rmM