తండ్రి కొడుకు కలిసి ఒక సినిమా… దర్శకుడు ఎవరంటే….

తండ్రి కొడుకు కలిసి ఒక సినిమా... దర్శకుడు ఎవరంటే....

0
112

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపుడి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు… ఈ ఏడాది ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపుడి నెక్ట్స్ ఎఫ్2 సీక్వేల్ ఎఫ్3 ప్లాన్ సిద్దం చేశాడు… ఈ చిత్రంలో వెంటేష్ అలాగే వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో నటిస్తాడని వార్తలు వచ్చాయి…

తొలుత మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి… ఆ తర్వాత హీరో రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చాయి… కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు… ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ ఫుల్ బిజీగా ఉన్నారు… ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి మరికొంత సమయం పడుతుంది..

ఈ లోగా మారో సినిమా కోసం అనిల్ కథ సిద్దం చేస్తున్నాడట ఓ క్రేజీ మల్టీ స్టారర్ కు శ్రీకారం చుట్టబోతున్నాడట… అక్కినేని నాగార్జున అఖిల్ తో ఓ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడట ఇప్పటికే అనిల్ ఒక లైన్ సిద్దం చేసి నాగార్జునకు వినిపించినట్లు సమాచారం… ఇక నాగార్జున కూడా ఒకే చెప్పడంతో పూర్తి కథ సిద్దం చేసేపనిలో పడ్డారట అనిల్ రావిపుడి..