యాంకర్ ప్రదీప్ పై నిర్భయ కేసు….

యాంకర్ ప్రదీప్ పై నిర్భయ కేసు....

0
93

ఓ ఎన్ జీవో సంస్థ సహకారంతో మిర్యాల గూడకు చెందిన ఓ 25 సంవత్సరాల యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఘటనలో అనేమంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు పోలీసులు… తనపై కొన్నేళ్లుగా 139 మంది ఐదు వేళ సార్లు బలత్కారం చేశారని ఆ యువతి ఫిర్యాదు చేసింది… ఇప్పుడు ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది…

యువతి ఇచ్చిన ఫిర్యాదులో బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో పాటు ఓ ఛానల్ టీవీ రిపోర్టర్, అలాగే సినీ నిర్మాతలు, కెమెరామెన్ ఓ మాజీ ఎంపీ, ఆయన పీఏ తోపాటు ఓ డాక్టర్ కూడా ఉన్నారని అలాగే ఎస్ఎఫ్ఐ సంస్థకు చెందిన అనేక మంది విద్యార్ధి నాయకులపై ఆ యువతి ఫిర్యాదు చేసింది…

దీంతో ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు… యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు… అయితే ఇందులో యాంకర్ ప్రదీప్ పేరు ఉండటంతో సంచలనంగా మారింది…