మెగా ఫాన్స్ కు పండగే..ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోలు..

0
100

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీనవిడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తేనే అరమవుతుంది ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో. అందుకే మల్టీస్టారర్ ఫిల్మ్స్ బాగా హిట్ అవుతాయని అందరు అభిప్రాయపడడంతో భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో చెర్రీ బాబాయ్ బ్యానర్ లో సినిమా చేయాలనీ ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

భవిష్యత్తులో గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ తో చెర్రీ మంచి మంచి సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘డ్రైవింగ్ లైసెన్స్, బ్రో డాడీ’ రీమేక్ లో  మెగా హీరోలతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో  ఏ పాత్ర సరిపోతుందని ఆలోచిస్తున్నారట. మరి ఇదే గనుక నిజం అయితే మెగా అభిమానుల ఆనందానికి హంతే ఉండదు.