ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..రాధేశ్యామ్ ఐదో షోకు గ్రీన్ సిగ్నల్

Festival for Prabhas fans..Green signal for Radheshyam fifth show

0
95

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచాయి. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో  రేపు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్యలో ఐదో షో ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రేపు ప్రభాస్ ‘ రాధేశ్యాం ’ సినిమా విడుదలవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. దీంతో రాధేశ్యామ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి.

తాజాగా రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరోవైపు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా పై  ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.