ఫిదా కథను ముందు ఆ ఇద్దరు హీరోలకి చెప్పా – దర్శకుడు శేఖర్ కమ్ముల

ఫిదా కథను ముందు ఆ ఇద్దరు హీరోలకి చెప్పా - దర్శకుడు శేఖర్ కమ్ముల

0
102

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు చాలా మంది అభిమానులు ఉంటారు.. ఆయన టేకింగ్ కథ మాటలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఆయన సినిమాల్లో అన్నీ పాత్రలకు మంచి పేరు వస్తుంది… ఇక చాలా సింపుల్ గా కథను అందరికి బాగా నచ్చే విధంగా తీస్తారు ఆయన. అయితే ఆయన తీసిన ఫిదా సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

 

 

అయితే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల… ఈ సినిమా గురించి ఓ విషయాన్ని చెప్పారు…ఫిదా స్టోరీని ముందు మహేశ్ బాబుకు, ఆపై రామ్ చరణ్ కు చెప్పానని, వారికి కుదరకపోవడంతోనే ఆ సినిమా చేసే అవకాశం వరుణ్ తేజ్ కు వచ్చిందని దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు.

 

అంతేకాదు గతంలో తాను ఆనంద్ సినిమా చేశాను ఆ సమయంలో శంకర్ దాదా విడుదల అయింది, మిత్రుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న పది మంది యువకులను ఆ సినిమాకు తీసుకుని వెళ్లానని అన్నారు. ఇక తన సినిమాల్లో కమెడియన్లు ఆలీ బ్రహ్మనందం ఉంటే బాగుంటుంది అని మా పిల్లలు భార్య కూడా అంటూ ఉంటారు అని తెలిపారు ఆయన…

లవ్ స్టోరీ సినిమా చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల, విడుదల కు సిద్దంగా ఉంది.