ఫైటర్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా

ఫైటర్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా

0
124

విజయ్ దేవరకొండ సినిమాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.. ఆయనకు క్రేజ్ మాములుగా లేదు.. తన తదుపరి చిత్రాలు కూడా సెట్స్ పై పెడుతున్నాడు. తాజాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.. ఆ సినిమా టైటిల్ ఫైటర్… అలాగే షూటింగ్ జరుపుకుంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా రిలీజవుతోంది

పూరీ సినిమాలో విజయ్ ఎన్నడూ చూడని యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్ లేదా కియరా అద్వాణీ అంటూ పేర్లు వినిపించాయి ఇప్పుడు అలియాభట్ పేరు తెరపైకి వస్తోంది.

అయితే బీ టౌన్ టాలీవుడ్ టౌన్ సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సినిమాలో ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ అతిధి పాత్రలో నటించే అవకాశం ఉందన్నచర్చ సాగుతోంది. ఇటీవల గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించిన క్రమంలో మంచి అవకాశాలు వస్తున్నాయి.. ఓ పక్క హీరోగా ప్రతినాయకుడిగా తనకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో ఈ సినిమా కోసం కరణ్ జోహార్ జాయిన్ అయ్యారు. ప్రీప్రొడక్షన్ పూర్తవుతోంది. సో కార్తికేయ మరి ఎస్ చెప్పారో నో చెప్పారో నెక్ట్స్ వీక్ తెలిసిపోనుందట