బన్నీతో సినిమా చర్చల్లో ఉంది : ప్రముఖ నిర్మాత వెల్లడి

0
101

అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ కంప్లీట్ అయింది. అయితే కరోనా వల్ల కాస్త షూటింగ్ కి బ్రేకులు ఇచ్చారు. ఇక ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా ప్రకటిస్తారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు.

టాలీవుడ్ వార్తల ప్రకారం ఆయన ఐకాన్ సినిమా చేయనున్నాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో దర్శకుడు మురుగదాస్ కూడా వచ్చారు. ఆయన కూడా బన్నీతో సినిమా చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఓ కథ కూడా వినిపించారట.

తమిళంలో నిర్మాతగా కలైపులి థాను బ్యానర్ కి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా
నిర్మిస్తూ ఉంటారాయన. అక్కడ అగ్రహీరో విజయ్ కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తారు.

తాజా ఇంటర్వ్యూలో ఆ నిర్మాత మాట్లాడుతూ అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ చర్చలు కార్యరూపాన్ని దాల్చుతాయని భావిస్తున్నాను అన్నారు. కచ్చితంగా ఇది మురుగదాస్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు. కలైపులి థాను బ్యానర్ లో తుపాకి, పోలీసోడు సినిమాలు మురుగదాస్ చేశారు.