ప్రకాశ్ రాజ్ గురించి బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్

0
117

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ మా అధ్యక్ష అభ్యర్థి, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకున్న స్థలంలో 10 ఎకరాలు ప్రకాశ్ రాజ్ అన్నకు ఇచ్చానని చెప్పారు. అందులో ఎంతోమందికి ఆయన పని కల్పించారని గుర్తు చేసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు అవకాశం ఇస్తే అసోసియేషన్ రూపురేఖలు మారిపోతాయని, అందరూ బాగుంటారని అన్నారు. ప్రకాశ్ రాజ్ తత్వమే అందరూ బాగుండాలనేది అని అభినందించారు.

మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే సమస్య ఉత్పన్నమే కాదన్నారు. అయినా ప్రకాశ్ రాజ్ 23 ఏళ్లుగా ఇక్కడే స్థిరపడిపోయారని చెప్పారు. మా ఊర్లో ఎంతోమందికి పని కల్పించారని చెప్పారు. ప్రకాశ్ రాజ్ అంటే మా ఊళ్ళో తెలియని వారు ఉండరు అన్నారు. మా సభ్యులందరూ, ఆర్టిస్టులందరూ ఆలోచన చేసి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరు నిస్వార్థంగా సర్వీస్ చేస్తారో ఆలచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.