సోనూ సూద్ పిల్లల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
534

సినిమాల్లో విలన్, రియల్ లైఫ్ లో హీరో గా ఉన్న సోనూసూద్ పిల్లల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సోనూ సూద్ కు ఇద్దరు అబ్బాయిలే. పెద్దవాడు ఇషాన్, రెండోవాడు అయాన్. వీరిద్దరూ సోనూ సూద్ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో తనవంతు సాయం చేస్తుంటారు. ఫౌండేషన్ అందిస్తున్న సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే సాయం చేయాలనుకుంటారని సోనూసూద్ సతీమణి సోనాలి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తమ పిల్లలు ఇద్దరూ చాలా సెన్సిటీవ్ అని చెప్పారు. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే వారి సమస్యను మా దృష్టికి తీసుకొస్తారని చెప్పారు. పిల్లల స్నేహితుల నుంచి కూడా చాలా వినతులు వస్తున్నాయని చెప్పారు. పిల్లల నుచి వచ్చిన సమస్యలపైన కూడా తమకు చేతనైన సాయం చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటితో ఆగిపోవని, తన భర్త, పిల్లల సహకారంతో మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు సోనాలి. ప్రస్తుతం కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇండియాలో సాయం అవసరమైన వారు ఎంతో మంది ఉన్నారని వారందరికి మనం ప్రత్యక్షంగా సేవ చేయకపోవచ్చు కానీ… మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎవరో ఒకరు స్పూర్తి పొందితే అంతకంటే ఏం కావాలని ఆమె పేర్కొన్నారు.

సోనూ సూదే కాదు కుటుంబమంతా ఇలాగే ఉండడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు కదా?