యాంకర్ అనసూయకు భారీగా ఫైన్

యాంకర్ అనసూయకు భారీగా ఫైన్

0
111

మొత్తానికి ఇటీవల సినిమా పరిశ్రమలో చాలా మంది ఇళ్లపై జీఎస్టీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే, తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 55 లక్షలు కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు అని తెలుస్తోంది. దీంతో ఇది టాలీవుడ్ లో పెద్ద షాకింగ్ వార్త అయింది.

సర్వీస్ ట్యాక్స్ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి ఉన్నారు అని తెలుస్తోంది.. అయితే, ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే కట్టారు. దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ వీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

అయితే దీనిపై అనసూయ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కాని ఇది వాస్తవం అని టాలీవుడ్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇంకెంత మంది ఈ లిస్టులో ఉన్నారో.