రొమాంటిక్ సెట్ లో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగింది..!!

రొమాంటిక్ సెట్ లో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగింది..!!

0
88

పూరి తనయుడు ఆకాష్ హీరో గా రొమాంటిక్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.. అనీల్ పాడూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ రాగ, ఆ పోస్టర్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి.. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ చిత్రం పై విమర్శలు చేశాయి.. అయినా సినిమా కి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.అయితే తాజాగా చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుండగా, సెట్‌లో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

దీంతో సెట్ ప్రాపర్టీ కొంత దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ నిర్మిస్తున్నాడు. తన తనయుడికి ఓ హిట్ ని అందించేందుకు పూరీ తెగ శ్రమ పడుతున్నాడు.