KGF-2 చూస్తుండగా థియేటర్‌లో కాల్పులు..అసలు కారణం ఏంటంటే?

0
89

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టించింది. ఈ నెల 14న విడుదలైన కెజిఎఫ్-2 మూవీ రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటికి థియేటర్స్ లో హౌజ్ ఫుల్ అవ్వడంతో..ఈ సినిమా చూడడానికి జనాలు ఎగపడుతున్నారు.

తాజాగా  కర్నాటక స్టేట్‌లోని హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ప్రేక్షకులందరూ కెజిఎఫ్2 మూవీ చూస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందపడుతున్న సమయంలో థియేటర్ లో ఒక్కసారే కాల్పుల శబ్దం వినిపించడంతో  సినీ ప్రేక్షకులందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. అసలేం జరిగినంటే..టాకీసులో సెకండ్ షో చూస్తున్న సమయంలో ఓ ప్రేక్షకుడి కాలు ముందు సీటులో ఉన్న ప్రేక్షకుడికి తగిలింది.

అలా చిన్న గొడవ గొడవ కాస్త పెద్దగా మారడంతో..ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. బయటకు వెళ్ళి గన్ తీసుకొచ్చి..అందరూ సినిమాలో నిమగ్నమై చూస్తుండగా ఒక్కసారిగా అతనిపై  కాల్పులు జరిపాడు. అనంతరం ఆ దుండగుడు పోలీసుల నుండి తప్పించుకున్నాడు. దాంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలిస్తున్నారు.