లైగర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..అదరగొట్టిన విజయ్ దేవరకొండ (వీడియో)

First Glimpses release from Liger..Vijay Devarakonda shocked (video)

0
105

అర్జున్ రెడ్డితో స్టార్ గా మారాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా..ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో పడింది చిత్ర బృందం. అయితే తాజాగా లైగర్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమా 2022 ఆగష్టు 25న విడుదల కానుంది.

https://youtu.be/4XmgqWXBnRA

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. ప్రఖ్యాత బాక్సర్ మైక్‌టైసన్‌ లైగర్‌‌లో కీ రోల్‌లో నటిస్తున్నారు. విజయ్‌… మైక్‌టైసన్‌ మధ్య చిత్రీకరించిన సీన్స్ మూవీకే హైలెట్ అట. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో లైగర్ రానుంది.