పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీలీల(Srileela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పెళ్లి సందడి తర్వాత మాస్ మాహారాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లోని అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి, నితిన్, వైష్ణవ్ తేజ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా.. ఈ అమ్మడు పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా నుంచి మేకర్లు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఎదురుగా నిల్చొని అమాయకంగా చూస్తున్న శ్రీలీల లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా, ప్రస్తుతం శ్రీలీల ఏకంగా పది చిత్రాల్లో నటిస్తోంది. అందులో దాదాపు 8 సినిమాలు అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఆరు సినిమాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరికొన్ని చిత్రాలు త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నాయి. దీంతో అస్సలు క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది శ్రీలీల(Srileela).
Srileela | పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్.. హీరోయిన్ ఫస్ట్‌లుక్ విడుదల
-