పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు.. ఇప్పుడు ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు, వకీల్ సాబ్ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కల్యాణ్, దీంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ విడుదల కానుంది. ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానులకి.
ఇక సినిమాపై పై రివ్యూ ఇచ్చారు ఒకరు, ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, మరి రివ్యూ ఇచ్చిన వారు ఎవరు అనేది చూస్తే…ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఇచ్చేశాడు.. ఈ సినిమా అద్బుతంగా ఉంది అని చెప్పేశారు. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని అని రివ్యూలు ఇస్తూ బాగా పాపులర్ అయ్యాడు.
వకీల్ సాబ్ సింగిల్ కట్ లేకుండా సెన్సార్ కంప్లీట్ చేసుకుందని.. ఔట్ స్టాడింగ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాడు. ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని ఆయన రివ్యూ ఇచ్చారు, ఇప్పుడు పవన్ అభిమానులు ఆయన మాటతో చాలా ఆనందంలో ఉన్నారు, ఇక ఈ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో నటించారు.
ReplyForward
|