శ్రియ మేనేజర్ అంటూ మోసం 5 లక్షలకు టోకరా

శ్రియ మేనేజర్ అంటూ మోసం 5 లక్షలకు టోకరా

0
101

ఇప్పుడు రియాల్టీ షోల హవా నడుస్తోంది, అయితే రియాల్టీ షో అంటే జడ్జీలు కంటెస్టెంట్స్ గురించి అందరూ చూస్తారు. అయితే ఇలా తమ దగ్గర ఓ రియాలిటీ షో ఉందని అందులో శ్రియని జడ్జిగా వ్యవహరించేందుకు తాము ఒఫ్పిస్తాము అని ఓ విలేఖరి ఐదు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడు.. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు..బంజారాహిల్స్ రోడ్డు నంబరు 5, దేవరకొండ బస్తీ హైనెస్ రెసిడెన్సీలో నివసిస్తున్న బి. చంద్రాయుడు సినీ దర్శకుడు. ఓ చానెల్లో పోస్ మోడల్ రియాల్టీ షో నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు.

అయితే ఈ ప్రోగ్రాంకు నటి శ్రియని జడ్జి అని అనుకున్నాడు, అందుకు ఆమె డేట్స్ కోసం చూశారు, కాని దొరకలేదు. ఈ సమయంలో మరో ఛానల్ యాంకర్ ద్వారా ఓ పత్రిక విలేఖరి చైతన్య అతనికి పరిచయం అయ్యాడు. ఈ సమయంలో శ్రియ మేనేజర్ అంటూ సిందూజ అనే అమ్మాయి పరిచయం అయింది. వన్ టైమ్ సెటిల్మెంట్ అని అడగారు, ముందు ఐదు లక్షలు ఇవ్వమన్నారు.. వెంటనే చంద్రాయుడు రోడ్డు నంబరు 1లోగల హోటల్ లో అతనికి డబ్బులు ఇచ్చాడు. కాని డబ్బులు తీసుకున్న తర్వాత వారు కనిపించలేదు, అంతేకాదు తర్వాత డబ్బులు ఇవ్వమని కోరడంతో మీకు నేను రిటర్న్ పంపించాను అని నకిలీ మెసేజులు చూపించారు.. కాని బ్యాంకుకు వెళ్లి అడిగితే డబ్బులు జమ కాలేదు అని తేలింది.. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.