Breaking: “రాధేశ్యామ్”కు ఫ్లాప్ టాక్..ప్రభాస్ అభిమాని సూసైడ్

0
63

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కతోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్ట‌కేల‌కు ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా 7000 కు పైగా స్క్రీన్స్‌ లో విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఒక్క హైదరాబాద్‌ సిటీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ గ్రాస్‌ 6.5 కోట్ల మార్కును క్రాస్‌ చేసింది.

కానీ ఈ సినిమా బోర్ గా ఉందని, ఫుల్ లవ్ స్టోరీ కావడంతో ప్రభాస్ ఇమేజ్ తగ్గ సన్నివేశాలు మిస్ అయ్యాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో… ప్రభాస్ అభిమాని ఒకరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అతనిది కర్నూలు జిల్లా తిలక్ నగర్ లో నివాసముండే రవితేజగా తెలుస్తుంది. తన తల్లితో చెప్పి మరీ రవితేజ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.