యాంకర్ రవి వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు…. అయితే తన షో లతో నిత్యం బిజిగా ఉండే రవి తాజాగా ఓ సమస్యలో చిక్కుకున్నాడు, అప్పుగా తీసుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వమంటే గూండాలను పంపి బెదిరిస్తున్నాడంటూ సందీప్ అనే వ్యక్తిపై టాలీవుడ్ యాంకర్ రవి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. సందీప్ గతంలో 45 లక్షలు అప్పుగా తీసుకున్నాడట కాని కొంత మొత్తమే ఇచ్చాడు, మిగిలింది ఇవ్వమంటే ఇవ్వడం లేదట.
మిగతా డబ్బులు అడుగుతుంటే ఇవ్వకపోగా, బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.
ఈ విషయంలో తాను ఎక్కడికి వెళ్లినా సందీప్ మనుషులు అనుసరిస్తూ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. సందీప్ తనతో పాటు మరికొందరిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఇటీవల తెలిసిందన్నాడు. అయితే తన డబ్బులు తనకు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు అని కంప్లైంట్ లో రాశాడు రవి, దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు పోలీసులు .