కోలీవుడ్ లో మరో విషాదకరఘటన చోటు చేసుకుంది, అక్కడ బుల్లితెరపై ఎంతో పేరు గడించిన నటి చిత్ర ఆత్మహత్య చేసుకుంది. పాండియన్ స్టోర్ లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర ఆమె వయసు 28 ఏళ్లు ఆత్మహత్య చేసుకుంది, దీంతో ఆమె అభిమానులు బుల్లితెర చిత్ర సీమ ఒక్కసారిగా షాక్ కి గురైంది.
చెన్నైలోని నజరేత్పేట్లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకి ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత్త హేమంత్ తో ఎంగేజ్ మెంట్ అయింది, వచ్చే ఏడాది వివాహం జరుగనుంది.
కాబోయే భర్తతో కలిసి హోటల్ గదిలో ఉన్న సమయంలోనే చిత్ర ఆత్మహత్య చేసుకోవడం షాక్ కి గురి చేసింది, షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈవీపీ ఫిల్మ్సిటీలో ఓ షూటింగులో పాల్గొన్న చిత్ర నిన్న రాత్రి 2.30 గంటల సమయంలో హోటల్ రూమ్కి వచ్చారు. స్నానం చేసి వస్తానని హేమంత్కు చెప్పి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటికి రాలేదు. ఆయన కంగారుతో వెంటనే మేనేజ్ మెంట్ కు చెప్పారు, వేరే కీతో డోర్ తెరిచారు, ఆమె ఉరివేసుకుని ఉంది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే దీని వెనుక గల కారణాలు ఏమిటి అని తెలుసుకుంటున్నారు పోలీసులు.