FLASH NEWS- పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్

FLASH NEWS-Bandla Ganesh gives new name to Pawan Kalyan

0
107

టాలీవుడ్ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మైక్ పట్టుకున్నారు అంటే ఆయన స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ కి ఆయన వీర భక్తుడు, ఆయన పవన్ కల్యాణ్ ని దేవుడు అనే పిలుస్తారు. పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక ఆయనతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

మాటల తుపానుగా బండ్ల గణేష్ ని అందరూ చెబుతారు, ఇక ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడారంటే రచయితలు కూడా ఆయనలా మాటలు రాయలేరు ఏమో అంత అద్భుతంగా ఉంటుంది ఆయన స్పీచ్ . ఆ మధ్య జరిగిన వకీల్ సాబ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే.

తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్ను దేవుడిగా ఎప్పుడూ అంటారు. అయితే ఈసారి ఆయన పవన్ కల్యాణ్ కి కొత్త పేరు పెట్టుకున్నారు.నా దేవరతో నేను అని అన్నారు. అయితే భక్త కన్నప్ప పరమేశ్వరుడిని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ని దేవర అని పిలుస్తాను అంటూ బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేశారు. ఇక అభిమానులు చాలా బాగుంది అన్నా అని కామెంట్లు చేస్తున్నారు.