ఫ్లాష్ న్యూస్ ….సినీనటుడు నాగశౌర్యపై కేసు

ఫ్లాష్ న్యూస్ ....సినీనటుడు నాగశౌర్యపై కేసు

0
107

సినిమా న‌టులు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి..లేక‌పోతే వివాదాల‌కు కార‌ణం అవుతారు, డ్రైవర్ల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు నాగశౌర్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది.

దీంతో హీరో నాగ‌శౌర్య‌కి పెద్ద షాక్ త‌గిలిన‌ట్టు అయింది….ఫేస్‌ టు ఫేస్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాగశౌర్య రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు, అయితే అశ్వ‌త్థామ సినిమాపై ఈ ప్ర‌శ్న, అందులో ప్రశ్నకు సమాధానం చెబుతూ… డ్రైవర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు జేఏసీ చైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ఆరోపించారు.

డ్రైవర్లు చదువురాని వారు, తాగుబోతులు అని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయ‌న‌పై చర్య‌లు తీసుకోవాలి అని కోరారు, దీనిపై క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.