ఫ్లాష్ న్యూస్– ఇక ఆపండి ? ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

ఫ్లాష్ న్యూస్-- ఇక ఆపండి ? ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

0
88

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. కొర‌టాల శివ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు, అయితే ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రిగింది. క‌రోనా వ‌ల్ల ఈ షూటింగ్ నిలిపివేశారు, అయితే ఈ సినిమాలో గ‌త నెల రోజులుగా ఓ చ‌ర్చ అయితే జ‌రుగుతోంది, ఇందులో చ‌ర‌ణ్ న‌టిస్తారు అని ముందు వార్త‌లు వ‌చ్చాయి.

త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి, మ‌ళ్లీ మ‌హేష్ బాబు చేయ‌డం లేదు అని చ‌ర‌ణ్ చేస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా, ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి, తనతో పాటు మహేశ్ నటిస్తున్నారన్న విషయంపై స్పష్టత ఇచ్చారు. అసలు ఆచార్య చిత్రంలో మహేశ్ బాబు నటించనున్నారన్న వార్త ఏ విధంగా పుట్టిందో నాకు తెలియడం లేదు.

అస‌లు చిత్ర యూనిట్ మేము మ‌హేష్ ని సంప్ర‌దించ‌లేదు, అవ‌స‌రం ఉంటే క‌చ్చితంగా న‌టిస్తారు, అత‌నికి మాకు మంచి అనుబంధం ఉంది, త‌నంటే నాకు అభిమానం అని తెలిపారు,
భవిష్యత్తులో అతనితో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను. కానీ ఈ చిత్రంలో నటించాలని ఆయన్ను సంప్రదించలేదు. ఈ వార్తలన్నీ పుకార్లే అని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.