ఫ్లాష్ న్యూస్ – ప్ర‌ముఖ నటికి క‌రోనా

ఫ్లాష్ న్యూస్ - ప్ర‌ముఖ నటికి క‌రోనా

0
95

ఈ వైర‌స్ ఎవ‌రికి సోకుతుందో తెలియ‌దు… అతి జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రు వైర‌స్ బారిన ప‌డుతున్నారు… సినిమా సెల‌బ్రెటీలు పారిశ్రామిక రాజ‌కీయ దిగ్గ‌జాల‌కు కూడా త‌ప్ప‌డం లేదు ఈ వైర‌స్ బాధ‌లు, అయితే సినిమా రంగంపై కూడా ఇది ఎంతో ప్ర‌భావం చూపించింది.

తాజాగా చాలా మంది న‌టులు షూటింగుల‌కి కూడా రావ‌డం లేదు.. పెద్ద సినిమాలు కూడా మ‌రో రెండు నెల‌లు షూటింగ్ కు విరామం ఇచ్చాయి, , తాజాగా టీవీ రంగంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్‌ లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు. తాజాగా బుల్లితెర నటి నవ్య స్వామి వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది, ఈ వార్త ఇప్పుడు బుల్లితెర‌ని షేక్ చేసింది….నా పేరు మీనాక్షి- ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుందట‌, ఈ మ‌ధ్య టెస్ట్ చేస్తే ఆమెకి పాజిటీవ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది, ఆమెతో క‌లిసి ఉన్న వారు యూనిట్ అంద‌రికి టెస్టులు చేస్తున్నారు.