ఫ్లాష్ న్యూస్ – ప్ర‌ముఖ న‌టుడికి విడాకులు ఇచ్చిన భార్య

ఫ్లాష్ న్యూస్ - ప్ర‌ముఖ న‌టుడికి విడాకులు ఇచ్చిన భార్య

0
105

సినిమా ప‌రిశ్ర‌మ అంటేనే రంగుల ప్ర‌పంచం.. అయితే వారి జీవితాల‌కు కూడా కాస్త ప్రైవ‌సీ ఉంటుంది, ఇలా ఒక‌టైన జంట‌లు ఎన్నో ఉన్నాయి, అయితే అంతే వేగంగా విడాకులు తీసుకున్న జంట‌లు ఉన్నాయి, తాజాగా ఈ లాక్ డౌన్ ఓ న‌టుడి ఇంటి కాపురంలో చిచ్చు పెట్టింది. ఈ మేరకు వాట్సప్, ఈమెయిల్ ద్వారా విడాకుల నోటీసులు పంపింది. ఇక ఆమెకి మెయింటెన్స్ కింద కొంత మొత్తాన్ని ఇవ్వాలి అని కోరింద‌ట‌.

బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య విడాకుల నోటిస్ పంపార‌ట‌…మే 7న నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్దిఖీ వాట్సప్ మెయిల్ ద్వారా విడాకుల నోటీస్ పంపింది. దీనిపై ఆయ‌న కూడా ఎక్క‌డా స్పందించ‌లేదు. చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి… అవి అంద‌రికి చెప్ప‌లేము, ప‌దేళ్ల మా జీవితంలో ముందు నుంచి స‌మ‌స్య‌లు ఉన్నాయి అని తెలిపింది ఆమె.

ఈ లాక్ డౌన్ వేళ నాకు ఆలోచించుకోవ‌డానికి చాలా స‌మయం దొరికింది , అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నా, నేను క‌లిసి ఉండాలి అని అనుకోవ‌డం లేదు, భ‌విష్య‌త్తులో కూడా క‌లిసి ఉండాలి అని భావించ‌డం లేదు, నేను ఆత్మ‌గౌర‌వం కోల్పోయాను అని ఆమె తెలిపింది.ఇక నేను నా నిజమైన గుర్తింపు . అంజనా కిషోర్ పాండేగానే ఉండాలనుకుంటున్నాను అని ఆమె తెలిపింది.