ఫ్లాష్ న్యూస్ – ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత

ఫ్లాష్ న్యూస్ - ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత

0
100

టాలీవుడ్ లో వ‌రుష విషాదాలు అల‌ముకుంటున్నాయి, ఈ క‌రోనా స‌మ‌యంలో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా అనారోగ్యంతో క‌న్నుమూస్తున్నారు, తాజాగా ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూశారు
కాష్మోరా చిత్ర దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆయ‌న ప‌లువురు అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేశారు, శోభన్ బాబుతో 1984లో సంపూర్ణ ప్రేమాయణం 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన కత్తుల కొండయ్య నిప్పులాంటి మనిషి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇక టాలీవుడ్ లో అంద‌రికి న‌చ్చిన చిత్రంగా 1986లో వచ్చిన కాష్మోరా చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ప్రజాధారణ పొందింది. ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌డంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.