ఫ్లాష్ న్యూస్ — టాలీవుడ్ లో మ‌రో విషాదం

ఫ్లాష్ న్యూస్ -- టాలీవుడ్ లో మ‌రో విషాదం

0
135

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస విషాదాలు అంద‌రిని క‌లిచివేస్తున్నాయి, లెజెండ‌రీ సింగ‌ర్ బాలు గారి మ‌ర‌ణం కూడా అంద‌రిని ఎంతో బాధించింది, ఇక ఇలాంటి స‌మ‌యంలో టాలీవుడ్ లో మ‌రో విషాదం జ‌రిగింది.

టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ కన్నుమూసారు. తెలుగు, తమిళ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోలా భాస్కర్ మ‌ర‌ణించారు, ఈ వార్త విని చిత్ర లోకం షాక్ అయింది,
కొద్దికాలంగా కోలా భాస్క‌ర్ గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. ఇటీవ‌ల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్చారు, అక్క‌డ చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

ఆయ‌న‌కు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది.ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరియ‌ర్లో ఇండస్ట్రీ హిట్ ఖుషి.. 7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలకు ఎడిటర్‌గా పని చేసారు. ఈ చిత్రాల‌తో ఆయ‌న‌కి ఎంతో పేరు గుర్తింపు వ‌చ్చింది, ఆయ‌న మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.