బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ ఎంత పెద్ద స్టార్ హీరోనే తెలిసిందే, అయితే నేడు ఆయన ఇంట్లో విషాదం జరిగింది, ఆయన కుటుంబం ఈ ఘటనతో షాక్ అయింది, అజయ్ దేవగణ్ సోదరుడు అనిల్ దేవగణ్ ముంబయిలో హఠాన్మరణం చెందారు.
అనిల్ వయసు 51 సంవత్సరాలు. అనిల్ గతరాత్రి గుండెపోటుకు గురయ్యాడని అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నా సోదరుడు నాకు దూరం అయిన రోజు అని తెలిపారు. అయితే ఆయన గురించి ట్వీట్ చేశాడు అజయ్ దేవగణ్.
నా తమ్ముడ్ని కోల్పోయాను. అతడి అకాలమరణంతో మా హృదయాలు బద్దలయ్యాయి. అతడి లేని లోటు మా కుటుంబ సభ్యులకు తీర్చలేనిది. నా తమ్ముడు ఆత్మకి శాంతిచేకూరాలి అని ప్రార్ధించమని కోరాడు, ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా, సామూహిక ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించడంలేదని వివరించారు, ఈ వార్త విని ఆయన ఫ్రెండ్స్ బాలీవుడ్ నటులు ఫోన్ లో ఆయనని పరామర్శిస్తున్నారు.