మన దేశ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది… మన దేశంలో ఎంతో పేరు సంపాదించుకున్న సింగర్ మన నుంచి దూరం అయ్యారు… భారతీయ ప్రముఖ సింగర్ జయరాజ్ నారాయణన్ మృతి చెందారు. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో
ఆయన కన్నుమూశారు… దాదాపు ఆయన కర్ణాటక సంగీతంలో 14 ఏళ్లు శిక్షణ పొందారు.. మంచి సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భక్తిగీతాలను పాడారు… వివిధ దేశాల్లో అనేక కన్సర్ట్ లు నిర్వహించారు.. అంతేకాదు సంగీతం గురించి ఆ గొప్పతనం గురించి అంతర్జాతీయ వేదికలపై అనేకసార్లు చాలా విషయాలు తెలిపారు… ఆయన కేరళలో పుట్టారు.
ఇక చిన్న వయస్సులోనే సింగింగ్లో పలు అవార్డులను సొంతం చేసుకున్న జయరాజ్.. 1996లో ఏసియానెట్ ఆఫ్ వాయిస్ మ్యూజిక్ కాంపిటేషన్లో విన్నర్గా నిలిచాడు… ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఆయన మరణ వార్త విని చిత్ర సీమ దిగ్బ్రాంతికి గురి అయింది… ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.
ReplyForward
|