డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తుంది పుష్ప సినిమా.. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఇక ఈ చిత్రం గురించి ఏదైనా ప్రకటన వస్తుందా అని ఫ్యాన్స్ చూస్తున్నారు..అయితే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది తాజాగా ఆచార్య కూడా వచ్చేయనుంది డేట్.
ఇకపుష్ప చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా బృందం.. ఆగస్టు 13న పుష్ప చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన మరో పోస్టర్ అలరిస్తోంది. బన్నీ ఈ పోస్టర్ లో బాగా కనిపిస్తున్నారు, ఇందులో బన్నీ గొడ్డలి పట్టుకుని ఉన్నారు, చుట్టు మనుషులు ఉన్నారు, మంచి రఫ్ లుక్ లో కనిపిస్తుంది.
మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది అంటున్నారు అందరూ..బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్గా కనపడనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.. ఇక చిత్తూరు యాసలో ఈ సినిమాలో డైలాగులు ఉంటాయి, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.