మనం ఏదైనా మాట్లాడే మాటలు రాసే పదాలు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే చాలా ఇబ్బందులు తప్పవు.. ఇక పబ్లిక్ ఫిగర్ గురించి ఆరాధించే నటుల గురించి ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే
వారి అభిమానులు ఫ్యాన్స్ ఆరాధించేవారు అస్సలు ఊరుకోరు, అందుకే ఇంటర్వ్యూల సమయంలో ఆచితూచి మాట్లాడాలి,
తాజాగా కన్నడ లెజెండరీ హీరో విష్ణువర్ధన్పై తెలుగు సీనియర్ నటుడు విజయ రంగ రాజు చేసిన కామెంట్స్ శాండల్ వుడ్ లో కలకలం రేపాయి. అక్కడ హీరోలు అందరూ కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు, తెలుగులో ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనని కొట్టాను అని అన్నారు విజయ రంగ రాజు , ఆయన మంచి వారు కాదని అన్నారు, దీంతో ఇలాంటి గొప్ప నటుడిపై కామెంట్లు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు కన్నడ నటులు, దీంతో భగ్గుమన్నారు.
రెస్పెక్ట్ ఆర్ట్ అండ్ రెస్పెక్ట్ ఆర్టిస్ట్ అనే పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు కన్నడ నటులు, దీనిపై విజయ రంగరాజు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు, ఇక సుదీప్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు, మొత్తానికి రంగ రాజు క్షమాపణలు చెప్పారు, తాను కామెంట్ చేయడం తప్పేనని, అసలు ఆయన్ని తాను కొట్టటం అంతా నిజం కాదని అన్నారు. కోపంలో అలా చెప్పాను అన్నారు, మొత్తానికి నేను చేసిన దానికి నాకు కరోనా సోకింది అని కన్నీరు పెట్టుకున్నారు, తనని వదిలేయండి అని తెలిపారు ఆయన.