IFFI :ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించేందుకు 4 తెలుగు సినిమాలు ఎంపికయ్యాయి. గోవాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే IFFIలో నాలుగు తెలుగు సినిమాలు ప్రదర్శించేందుకు ఎంపిక చేయటం పట్ల తెలుగు ఇండస్ట్రీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫీచర్ ఫిల్మ్ మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో RRR, అఖండతో పాటు సంచలనం సృష్టించిన హిందీ సినిమా కశ్మీర్ ఫైల్స్ ఎంపిక అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మరో రెండు తెలుగు సినిమా బండి, ఖుదీరాం బోస్ ఎంపికయ్యాయి. తొలి యువ స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఖుదీరాం బోస్’ జీవితం ఆధారంగా ఖుదీరాం బోస్ సినిమా చిత్రీకరించారు. ఈ సినిమా టైటిల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022కు ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు IFFI ప్రదర్శన జరగనుండగా.. మెుత్తం 354 భారతీయ చిత్రాలు ప్రదర్శనకు అర్హత సాధించాయి.