క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త సినిమా పాట విడుదల..!!

-

క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ లు ప్రధానపాత్రలుగా నటించిన చిత్రం “ఫ్రెండ్ షిప్”.. ‘సింగ్ అండ్ కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ ‘మిస్ శ్రీలంక’ ‘లోస్లియా’ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు.

- Advertisement -

పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ నటిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగో ను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం.. శాంతకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా నుంచి ‘లైఫ్ లో మజా కోసం’ అనే పాట విడుదలైంది. లహరి మ్యూజిక్ లో ఈ పాట విడుదల కాగా ఈ పాటను శరత్ సంతోష్ పాడారు. కాగా ఈ పాటకు మంచి స్పందన వస్తుంది.

నటీనటులు : హర్భజన్ సింగ్, అర్జున్, లోస్లియా, జె.సతీష్ కుమార్, సతీష్ తదితరులు..

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్
మాటలు: రాజశేఖర్ రెడ్డి
సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: శాంతకుమార్
నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ
దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...