ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాశీఖన్నా

ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాశీఖన్నా

0
103

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది నటి రాశీఖన్నా. సుప్రీమ్, హైపర్, జై- లవకుశ, వెంకీమామ,ప్రతిరోజూ పండగే వంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుస సినిమాలు చేసింది ఈ చిన్నది.

గతేడాది వెంకీమామ, ప్రతిరోజూ పండగే వరుస హిట్ విజయాలు అందుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది నటించిన వరల్డ్ ఫేమస్ లవ్ లో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో కాస్త వెనుకడుగు పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకు ప్రాజెక్టుకు సైన్ చేయలేదు.

ప్రస్తుతం తమిళ సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చెప్పింది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేనాపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తుగ్లక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని వస్తున్న వార్తలను సినీ నటి రాశీఖన్నా కొట్టిపారేసింది.