ప్రభాస్ అభిమానులకు ఫుల్ క్లారిటీ..సంక్రాంతికి రావడం పక్కా..డైరెక్టర్ క్లారిటీ!

Full Clarity for Prabhas fans..coming to Sankranthi is perfect..Director Clarity!

0
90

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవలే ‘ఆర్​ఆర్​ఆర్’​ వాయిదా పడిన నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ విడుదలపైనా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్, బంగార్రాజు సంక్రాంతి బరిలో నిలిచినసంగతి తెలిసిందే.

అయితే నూతన సంవత్సరం కానుకగా విడుదల చేసిన పోస్టర్​లోనూ విడుదల తేదీ జనవరి 14 అనే ఉంది. దీంతో ఫ్యాన్స్​లో కొంత ఉపశమనం కలిగినా..మరికొందరిలో అనుమానం అలాగే ఉంది. ఈ క్రమంలోనే రిలీజ్​ డేట్​పై మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.

జనవరి 2న ఓ అభిమాని పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు రాధాకృష్ణ. దానికి మరో ఫ్యాన్​ రిప్లై ఇస్తూ.. “సినిమాను ప్రీ పోన్ చేస్తున్నారా? పోస్ట్​పోన్ చేస్తున్నారా? స్పష్టత ఇవ్వండి.. లేదంటే ఓ లేడీ ఫ్యాన్.. ‘మరోసారి సూసైడ్​ లెటర్​ రాస్తుంది.. అసలే ఆమె ప్రెగ్నెంట్’​” అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన రాధాకృష్ణ.. “ఇట్స్​ టైమ్​ ఫర్​ లవ్​ లెటర్స్​, నాట్ సూసైడ్​ లెటర్స్ (ఇది ప్రేమలేఖల సమయం..సూసైడ్​ లేఖలది కాదు)” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే ‘రాధేశ్యామ్’ రానుందని మరోసారి స్పష్టమైంది.