ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా గబ్బర్ సింగ్..

0
116

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనబడనున్నారు.

కరోనా వైరస్ థార్డ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీన ట్రైలర్ రిలీజ్ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తుంది. ఈ కార్యక్రమానికి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా పిలవాలని ఆలోచిస్తుందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.