సైరా ని కలిసిన గద్దలకొండ గణేష్..!!

సైరా ని కలిసిన గద్దలకొండ గణేష్..!!

0
129

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్ ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో తన సక్సెస్ ని కంటిన్యూ చేశాడు వరుణ్.

అటు హరీష్ శంకర్ కి కూడా ఈ సినిమా పడాల్సిన టైం లో హిట్ అందుకోగా తన కెరీర్ లో మరో హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇక పోతే ఈ మూవీని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి మూవీ చాలా బాగుందని ప్రశంసించాడు.. ముఖ్యంగా వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడని అన్నారు.

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయని , ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని అభినందించారు.ఈ సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.