మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రెండేళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు మూవీ టైటిల్ పోస్టర్ తప్ప ఏ అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
Game Changer | తాజాగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. రేపు(బుధవారం) చరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటను మార్చి 27వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను దర్శకుడు శంకర్ గ్రాండ్‌గా తీసినట్లు చెబుతున్నారు.
ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో ‘రంగస్థలం’ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇక ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ మూవీలో చరణ్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.