గంగవ్వకు కరోనా పరీక్ష- శనివారం బిగ్ బాస్ కీలక ప్రకటన

గంగవ్వకు కరోనా పరీక్ష- శనివారం బిగ్ బాస్ కీలక ప్రకటన

0
99

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు.. అయితే కచ్చితంగా డబులు ఎలిమినేషన్ ఉంటుంది అని తెలుస్తోంది, అయితే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఎంత చలాకీగా ఉన్నా అక్కడ వాతావరణం ఆమెకి పడటం లేదు.. తాను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని గంగవ్వ బిగ్ బాస్ తో చెప్పి కన్నీరు పెట్టుకుంది.

ఇది అందరిని కలిచివేసింది, ఆమె అక్కడ హౌస్ లో ఉండాలి అనుకున్న అభిమానులు కూడా ఇప్పుడు ఆమెని ఇక బయటకు పంపండి ఆమె కన్నీరు చూడలేకపోతున్నాం అని సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు.

అయితే గంగవ్వ ఒకవేళ వచ్చేస్తాను అంటే ఈ శనివారం బిగ్ బాస్ ఆమెని బయటకు పంపుతారు అని తెలుస్తోంది, అయితే వైద్యులు చూసి ఆమెకి బాగానే ఉంది అని తెలిపారట, ఒకవేళ ఆమె ఇక ఉండలేను అని చెబితే బయటకు పంపేస్తారు అని తెలుస్తోంది, అయితే శనివారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది, కంటెస్టెంట్లను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, అందరికీ పరీక్షలు చేశాక నెగెటివ్ అని తేలితేనే లోనికి పంపించారు. తాజాగా గంగవ్వకు మరోసారి కరోనా పరీక్ష చేసినట్లు తెలుస్తోంది.