‘మా’ ఎన్నికల నుండి తప్పుకున్న బండ్ల గణేష్

0
86

‘మా’ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా జెనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేసిన బండ్ల గణేష్ వున్నట్లుండి పోటీ నుండి తప్పుకున్నారు. దీనితో నామినేషన్ ను ఉపసంహరించుకోగా..దానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. బండ్ల గణేష్ మొదట ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఆ తరువాత ఆయన ప్యానెల్ నుండే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు పోటీ నుండి తప్పుకోవడంతో ‘మా’ హీట్ తారాస్థాయికి చేరింది. మరి బండ్ల గణేష్ ఎవరికైనా సపోర్ట్ చేస్తారా లేక సైలెంట్ గానే ఉండిపోతారో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.