‘గ్యాంగ్ లీడర్’ ఫస్టులుక్ వచ్చేసింది

'గ్యాంగ్ లీడర్' ఫస్టులుక్ వచ్చేసింది

0
95

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ‘గ్యాంగ్ లీడర్’ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. నాని .. ఆయన గ్యాంగ్ తో కూడిన పోస్టర్ ను ఫస్టులుక్ గా వదిలారు.

నానీ గ్యాంగ్ లో బామ్మ .. వరలక్ష్మి .. ప్రియా .. స్వాతి .. చిన్నూ సభ్యులుగా వున్న విషయాన్ని రివీల్ చేశారు. వీళ్లంతా కూడా బైనాక్యులర్స్ తో ఎవరినో రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ అనేది రఫ్ గా అనిపించే టైటిల్ అయినప్పటికీ, ఈ పోస్టర్ ను బట్టి ఇది పూర్తి వినోదభరితంగా సాగే కథ అని తెలుస్తోంది. ఈ గ్యాంగ్ తో కలిసి లీడర్ గా నాని ఆద్యంతం చేయనున్న సందడియే ఈ సినిమా అనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన ఫస్టు సాంగును .. 24వ తేదీన ఫస్టు టీజర్ ను విడుదల చేయనున్నారు.